ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిరూ స్పెషల్ సాంగ్ లో కేథరిన్

Fri, May 20, 2016
కేథరిన్
కేథరిన్
చిరంజీవి 150వ సినిమా 'కత్తిలాంటోడు'కి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా అనుష్క నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్త షికారు చేస్తోంది. ఇక తమన్నా ఒక పాటలో చిరూతో కలిసి స్టెప్పులు వేసే ఛాన్స్ ఉందని నిన్నటి వరకు అనుకున్నారు.

అయితే ఆ అవకాశం కేథరిన్ కి వెళ్లిందనేది తాజా సమాచారం. ఇందులో ఆమె ఓ ప్రత్యేక పాత్ర పోషించడంతో పాటు ఓ పాటలో చిరూతో కలసి డ్యాన్స్ చేస్తుందట. అల్లు అర్జున్ కి జోడీగా 'ఇద్దరమ్మాయిలతో' .. 'సరైనోడు' సినిమాలు చేసిన కేథరిన్, తెలుగులోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఆమెకి, 'సరైనోడు' సక్సెస్ ఊరటనిచ్చింది. ఈ సమయంలోనే ఆమెకి చిరూ సినిమాలో అవకాశం దక్కడం విశేషమని అనుకుంటున్నారు. అదే నిజమైతే కేథరిన్ మరింత క్రేజ్ ను సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)