ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కమల్ కోసం ఇళయరాజా స్పెషల్ ట్యూన్స్!

Wed, May 18, 2016
ఇళయరాజా
ఇళయరాజా
నవరసాలను అద్భుతంగా పలికించడంలో కమలహాసన్ కి ఎంత నైపుణ్యం వుందో, మధురమైన బాణీలతో మనసును మంత్రించడంలో ఇళయరాజాకి అంతటి ప్రతిభ వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. సుదీర్ఘకాలం పాటు కలిసి పనిచేసిన కారణంగా ఈ ఇద్దరి మధ్య విడదీయరాని స్నేహం వుంది. అలాంటిది అనుకోకుండానే కమల్ సినిమాకి ఇళయరాజా పనిచేయక పది సంవత్సరాలు గడిచిపోయాయి.

'ముంబై ఎక్స్ ప్రెస్' తరువాత కమల్ సినిమాకి పనిచేయని ఇళయరాజా, కమల్ తాజా చిత్రం 'శభాష్ నాయుడు' సినిమాకి బాణీలు కడుతున్నారు. కమల్ సినిమాకి సంగీతాన్ని అందించక చాలాకాలం అయిన కారణంగా .. కమల్ పట్ల గల అభిమానం కారణంగా ఈ సినిమాకి స్పెషల్ ట్యూన్స్ అందించడానికి ఇళయరాజా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇటీవల తన సినిమాలకు వరుసగా 'గిబ్రాన్'ను తీసుకున్న కమల్, మళ్లీ ఇళయరాజాను ఎంచుకోవడం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)