ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బాహుబలి' మార్చేసిందంటోన్న తమన్నా

Wed, May 18, 2016
తమన్నా
తమన్నా
తెలుగు తెరపై అందాల కథానాయికగా తమన్నా నూటికి నూరు మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు తమిళంలోను తన హవాను కొనసాగించే ప్రయత్నంలో వుంది. అలాంటి తమన్నా 'బాహుబలి' సినిమా చేసిన దగ్గర నుంచి తన ఆలోచనా విధానం మారిపోయిందని చెబుతోంది. మొదటి నుంచి కూడా తమన్నా గ్లామర్ పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. ప్రయోగాత్మక పాత్రలవైపు వెళ్లడానికి ఆమె సాహసించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమెకి 'బాహుబలి' సినిమాలో ఛాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో పాత్ర పరంగా .. వస్త్రధారణ పరంగా పాటల్లో మినహా మరెక్కడా ఆమె అందంగా కనిపించదు. అలాంటి ఆమె పాత్రని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. విభిన్నమైన పాత్రలను చేసినప్పుడు లభించే ఆదరణ ఎలా ఉంటుందనేది తనకి ఈ సినిమా నుంచే అర్థమైందని తమన్నా చెబుతోంది. అందువలన అలాంటి పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాననీ, ప్రస్తుతం తాను చేస్తోన్న 'కత్తి సందై' .. 'అభినేత్రి' సినిమాలలోని పాత్రలు కూడా విలక్షణమైనవేనని ఆమె చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)