ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పూరీ చిత్రానికి భారీ బడ్జెట్టు!

Wed, May 18, 2016
కల్యాణ్ రామ్, పూరీ జగన్నాథ్
కల్యాణ్ రామ్, పూరీ జగన్నాథ్
దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలంటేనే భారీతనం ఉట్టిపడుతుంది. దాంతో బడ్జెట్టు కూడా అదే స్థాయిలో వుంటుంది. అయితే, ఆయన ఎక్కువగా స్టార్ హీరోలతో చేస్తారు కాబట్టి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సాధారణంగా బిజినెస్ పరంగా ఇబ్బంది ఎదురవదు. అయితే, ఇప్పుడు నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రానికి కూడా భారీ బడ్జెట్టు వేసుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుమారు 30 కోట్లు ఖర్చుపెడుతున్నట్టు సమాచారం.
ఒకవిధంగా కల్యాణ్ రామ్ కు వున్న బిజినెస్ స్థాయిని బట్టి చూస్తే ఇది బాగా ఎక్కువే. అయితే, దర్శకుడు పూరీ ఇమేజ్ కూడా తోడవుతుంది కాబట్టి బిజినెస్ విషయంలో ఇబ్బంది ఉండదని అనుకుంటున్నారట. ఏమైనా, ఈ సినిమా మాత్రం ఈ నందమూరి హీరోకి స్పెషల్ సినిమా అవుతుందనే చెప్పచ్చు. మాజీ మిస్ ఇండియా అదితి ఆర్య కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి జరుగుతుంది.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)