ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలీవుడ్ కి అందుబాటులో సుధీర్ బాబు

Tue, May 17, 2016
సుధీర్ బాబు
సుధీర్ బాబు
తెలుగులో విభిన్నమైన సినిమాలను .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చిన సుధీర్ బాబు, 'బాఘీ' సినిమాతో బాలీవుడ్ లోను మంచి మార్కులు కొట్టేశాడు. భారీ వసూళ్లను సాధించిన ఈ సినిమాలో ఆయన విలన్ గా నటించాడు. సాధారణ ప్రేక్షకులను తన నటనతో మెప్పించడమే కాకుండా, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. దాంతో ఆయనని సంప్రదిస్తోన్న బాలీవుడ్ దర్శక నిర్మాతల సంఖ్య పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో వాళ్లకి అందుబాటులో ఉండటం కోసం కొంత కాలం పాటు ముంబైలో ఉండాలనే నిర్ణయానికి సుధీర్ బాబు వచ్చాడు. అక్కడ మంచి ఇంటి కోసం గాలిస్తున్నట్టుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఆయన చెప్పాడు. మహేశ్ బాబు కూడా ఆయన నిర్ణయాన్ని సమర్ధించాడని అంటున్నారు. ఒక వైపున తెలుగు సినిమాలు చేస్తూనే, మరో వైపున హిందీలో బిజీ కావడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేస్తున్నాడన్నమాట.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)