ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అనసూయ అంత డిమాండ్ చేస్తుందా?

Mon, May 16, 2016
అనసూయ
అనసూయ
బుల్లితెరపై సందడి చేస్తూ .. వెండితెరపై కూడా అనసూయ తనదైన మార్క్ వేసింది. 'సోగ్గాడే చిన్నినాయన' .. 'క్షణం' వంటి చిత్రాలు నటిగా ఆమెకి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. దాంతో ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు బాగా వస్తున్నాయి. అయితే తన రెమ్యునరేషన్ గా ఆమె 40 లక్షలు అడుగుతోందని సమాచారం. అనసూయ తరహా పాత్రలు చేయడానికి సిద్ధంగా వున్న కొంతమంది కథానాయికలు, తమకి 20 లక్షలు ఇస్తే చాలు అంటున్నారట.

దాంతో కొంతమంది దర్శక నిర్మాతలు అనసూయకి బదులుగా వేరే వారిని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. అయినా అనసూయ తన రెమ్యునరేషన్ విషయంలో ఎంతమాత్రం తగ్గడం లేదని అంటున్నారు. అనసూయకి వున్న క్రేజ్ వేరు .. ఆమె చేస్తే ఆ పాత్రకి వచ్చే రెస్పాన్స్ వేరు. అందువలన అనసూయని తీసుకోవడమే మంచిదని భావించే పెద్ద బ్యానర్లు మాత్రం, ఆమె అడిగిన పారితోషికం ఇవ్వడానికి వెనుకాడటం లేదని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)