ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ జోడీగా శ్రుతిహాసన్ ఖరారు!

Sat, May 14, 2016
శ్రుతిహాసన్
శ్రుతిహాసన్
'సర్దార్ గబ్బర్ సింగ్' తరువాత పెద్ద గ్యాప్ తీసుకోకుండానే పవన్ కల్యాణ్ తన తదుపరి చిత్రం షూటింగును ఆరంభించాడు. ఎస్.జె. సూర్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో మలయాళీ కథానాయిక పార్వతీ మీనన్ ను ఎంపిక చేయనున్నట్టుగా ఆ మధ్య వార్తలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో శ్రుతిహాసన్ ను కథానాయికగా ఎంపిక చేసినట్టు, ఈ రోజు ఈ సినిమా టీమ్ అధికారిక ప్రకటన చేసింది. 'గబ్బర్ సింగ్'లో తొలిసారిగా జోడీకట్టిన ఈ జంటకి ఆడియన్స్ నుంచి నూటికి నూరు మార్కులు పడ్డాయి. దాంతో ఈ సినిమా కోసం ఆమెనే తీసుకున్నారని అంటున్నారు. శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగును ఆరంభించనుంది. 'గబ్బర్ సింగ్' మాదిరిగానే ఈ జంట మరో సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)