ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సీక్వెల్ దిశగా 'భారతీయుడు'

Sat, May 14, 2016
కమలహాసన్
కమలహాసన్
శంకర్ దర్శకత్వంలో కమల హాసన్ కథానాయకుడిగా వచ్చిన 'భారతీయుడు' సినిమాను, ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. అవినీతి .. నిర్లక్ష్యంపై ఒక స్వాతంత్ర్య సమరయోధుడు చేసిన పోరాటంగా తెరకెక్కిన ఈ సినిమా, అప్పట్లో సంచలన విజయానికి సరైన అర్థం చెప్పింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ రానుందనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తూ వస్తున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు త్వరలో మొదలుకానున్నాయట.

మొదటి నుంచి కూడా ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో కమల్ .. శంకర్ వున్నారు. అందువల్లనే ఈ సినిమాలో 'భారతీయుడు' .. మళ్లీ తన దేశానికి తన అవసరం ఏర్పడినప్పుడు తిరిగి వస్తానని చెప్పి విదేశాలకి వెళతాడు. అక్కడి నుంచే సీక్వెల్ కథ మొదలుకానుందని చెబుతున్నారు. ఈ సినిమాను నిర్మించిన సూర్య మూవీస్ వారే .. ఈ సీక్వెల్ చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తివివరాలు త్వరలో తెలిసే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)