ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అనుష్కతో 'చంద్రముఖి 2'కి ప్లానింగ్!

Sat, May 14, 2016
అనుష్క
అనుష్క
'చంద్రముఖి' సినిమా సాధించిన విజయం .. సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ తరహా కథలు అనేకం తెరపైకి రావడానికి ఈ సినిమా కారణమైంది. అశేష ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ సినిమాకి, సీక్వెల్ రానున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఎందుకో ఆ ప్రయత్నం కార్యరూపాన్ని దాల్చలేదు. ఈ నేపథ్యంలో 'చంద్రముఖి 2' అనే సినిమాకి రంగం సిద్ధమవుతోంది.

గతంలో 'చంద్రముఖి' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పి.వాసు .. ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే ఇది సీక్వెల్ కాదు .. రీమేక్. ఈ ఏడాది ఆరంభంలో పి.వాసు దర్శకత్వంలో 'శివలింగ' అనే కన్నడ సినిమా వచ్చింది. శివరాజ్ కుమార్ .. వేదిక నటించిన ఈ సినిమా అక్కడ అసాధారణమైన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో లారెన్స్ .. అనుష్కలతో రీమేక్ చేయబోతున్నారు. అలాగే తెలుగులోను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, ఈ టైటిల్ తోనే ఈ సినిమా సగం సక్సెస్ ను అందుకుంటుందని చెప్పొచ్చు.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)