ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దర్శకుడిని తప్పు పట్టనంటున్న దిల్ రాజు!

Sat, May 14, 2016
దిల్ రాజు
దిల్ రాజు
మంచి అభిరుచి కలిగిన నిర్మాతగా దిల్ రాజు కి పేరుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించే సినిమాలనే కాదు, యూత్ ను మెప్పించే సినిమాలను తీయడంలో కూడా ఆయన సిద్ధహస్తుడు. అలాంటి దిల్ రాజు ఇటీవల నిర్మించిన 'సుప్రీమ్' సినిమా ఘనవిజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సక్సెస్ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

దర్శకుడు చెప్పిన కథను నమ్మి తాను సినిమాలు చేయడం జరుగుతుందని చెప్పాడు. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు హిట్ కావడం .. మరి కొన్ని సినిమాలు పరాజయం పాలు కావడం జరుగుతుందని అన్నాడు. సినిమా ఫ్లాప్ అయినా తాను దర్శకుడిని తప్పుపట్టనని చెప్పాడు. అటువంటి కథను సినిమాగా తీయడం అన్నది తన తప్పుగానే భావిస్తానని అన్నాడు. అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే తాను కథలను ఎంచుకుంటూ ఉంటాననీ, అలాంటి కథతోనే 'శతమానం భవతి' సినిమా రూపొందనుందని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)