ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రానా 'ఘాజీ'తో రెడీ అవుతున్నాడు

Sat, May 14, 2016
రానా
రానా
రానా కథానాయకుడిగా నటించిన 'ఘాజీ' చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ రెండు వెర్షన్స్ కి సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు వున్నారు.

ఇండియా .. పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రానా నేవీ ఆఫీసర్ గా నటించాడు. ఈ పాత్రలో సహజత్వాన్ని తీసుకురావడానికి ఆయన సీనియర్ నేవీ అధికారుల సలహాలను .. సూచనలను తీసుకుని ఈ పాత్రను పోషించడం విశేషం. తాప్సీ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమా సక్సెస్ పై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. తనకి మరిన్ని ఛాన్సులు వస్తాయని భావిస్తోంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)