ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దర్శకుడిగా రాజమౌళి తనయుడు!

Wed, May 11, 2016
కార్తికేయ
కార్తికేయ
దర్శకుడిగా రాజమౌళి సాధించిన విజయాలను గురించి .. సంపాదించిన కీర్తిప్రతిష్ఠలను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అపజయమెరుగని దర్శకుడిగా ఆయనకి ఎంతో క్రేజ్ వుంది. అలాంటి రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా దర్శకత్వంపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. కార్తికేయ తన తండ్రి సినిమాలకి అసిస్టెంట్ గా పనిచేస్తూ, దర్శకత్వానికి సంబంధించిన మెళుకువలు నేర్చుకుంటున్నాడు.

అలా 'బాహుబలి' సినిమాకి పనిచేసిన కార్తికేయ, ప్రస్తుతం 'బాహుబలి 2'కి కూడా అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఆ మధ్య ఒక వేదికపై తన తనయుడు పనితీరును రాజమౌళి మెచ్చుకున్న సంగతి తెలిసిందే. అలా తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో దర్శకుడిగా రంగంలోకి దిగాలనే ఆలోచనలో కార్తికేయ ఉన్నాడని అంటున్నారు. అందుకు సంబంధించిన కథను కూడా ఆయన రెడీ చేసుకుంటున్నాడని అంటున్నారు. బహుశా 'బాహుబలి 2' తరువాత ఆయన మెగా ఫోన్ పట్టవచ్చని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)