ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వచ్చేనెలలోనే సెట్స్ పైకి 'రాబిన్ హుడ్'

Wed, May 11, 2016
రవితేజ
రవితేజ
'బెంగాల్ టైగర్' సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి చాలా కాలమైనా, రవితేజ నుంచి ఇంకో సినిమా రాలేదు. దాంతో ఆయన అభిమానులు మరో సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పాటికే ఆయన 'ఎవడో ఒకడు' సినిమా పూర్తిచేస్తూ ఉండేవాడు. అయితే, ఆ సినిమా ఆదిలోనే ఆగిపోవడంతో ఇంత గ్యాప్ వచ్చింది.

ఆ తరువాత ఆయన చక్రి దర్శకత్వంలో 'రాబిన్ హుడ్' సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. కానీ అది ఇంతవరకూ సెట్స్ పైకి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సినిమా ఈ ఏడాది ఉంటుందా .. ఉండదా అనే సందేహం అందరిలోనూ తలెత్తింది. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ సినిమా జూన్ 10న సెట్స్ పైకి రానుందని అంటున్నారు. ఆ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ అవుతుందని చెబుతున్నారు. రవితేజ సరసన ఈ సినిమాలో రాశిఖన్నా నటించనుంది. 'బెంగాల్ టైగర్'లో రవితేజతో కలిసి రాశిఖన్నా సందడి చేసిన సంగతి తెలిసిందే. 'రాబిన్ హుడ్'తో మరోమారు ఈ జోడీ తెరపై కనువిందు చేయనుందన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)