ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమితాబ్ తో పూరీ మూవీ?

Mon, May 09, 2016
పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్
టాలీవుడ్ అగ్రదర్శకులలో పూరీ జగన్నాథ్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. తెలుగు కథానాయకులతో చకచకా సినిమాలు చేసే పూరీ, అదే స్పీడుతో ఆ మధ్య బాలీవుడ్ సినిమా చేశాడు .. అదీ అమితాబ్ తో! ఈ ఇద్దరి కాంబినేషన్లో 'బుడ్డా హోగా తేరా బాప్' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమితాబ్ తో మరో సినిమా చేయబోతున్నానని పూరీ స్వయంగా చెప్పాడు.

ఇటీవల ముంబైలోని రామ్ గోపాల్ వర్మ కొత్త స్టూడియోకి పూరీ వెళ్లాడట. అదే సమయంలో అక్కడ అమితాబ్ ను కలిసినట్టు ఆయన చెప్పాడు. అమితాబ్ తో మరో సినిమా చేయాలని వుందని చెప్పగా, అందుకు ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారని అన్నాడు. ఇటీవలే పూరీ 'రోగ్' సినిమాను పూర్తిచేశాడు. ఈ నెల 25న కల్యాణ్ రామ్ కథానాయకుడిగా మరో సినిమా మొదలుకానుంది. ఈ సినిమా తరువాత అమితాబ్ ను కథతో మెప్పించి ఆయనతో సెట్స్ పైకి వెళతాడేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)