ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దసరాకి సెట్స్ పైకి విజయశాంతి!

Mon, May 09, 2016
విజయశాంతి
విజయశాంతి
ఆ మధ్య రాజకీయాలలో చురుకైన పాత్రను పోషించిన విజయశాంతి, ఆ తరువాత రాజకీయాలకి దూరమవుతూ వచ్చారు. ఇక ఆమె తన పూర్తి సమయాన్ని సినిమాలకి కేటాయించనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తన సినిమాకి సంబంధించిన పనుల్లోనే బిజీగా వున్నారనేది తాజా సమాచారం. దేశభక్తికి సంబంధించిన కథాంశంతో ఆమె రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ఒక తమిళ దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమాకి, విజయశాంతి భర్త నిర్మాతగా వ్యవహరించనున్నాడని అంటున్నారు. ఒక వైపున ఈ సినిమా కథ .. కథనాలు సిద్ధమవుతూ వుండగా, మరో వైపున తన పాత్ర కోసం విజయశాంతి మిలటరీ తరహా శిక్షణ తీసుకుంటున్నారని చెబుతున్నారు. 'దసరా' పండుగ రోజున ఈ సినిమాను లాంచ్ చేసి, 'సంక్రాంతి'కి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)