ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సాయిధరమ్ తేజ్ గురించి సమంతా!

Sat, May 07, 2016
సమంతా
సమంతా
సాయిధరమ్ తేజ్ - సమంతా కాంబినేషన్లో ఒక సినిమా రూపొందే అవకాశం ఎంతో దూరంలో లేనట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఈ టాక్ ఫిల్మ్ నగర్లోను జోరుగా వినిపిస్తోంది. తాజాగా సాయిధరమ్ తేజ్ గురించి సమంతా చేసిన ట్వీట్, ఈ ఊహాగానాలకి తెరతీసింది. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా చేసిన 'సుప్రీమ్' మొన్న భారీస్థాయిలో విడుదలైంది. అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసి, సాయిధరమ్ తేజ్ ఫుల్ ఖుషీ అవుతున్నాడట.

ఈ సినిమా గురించిన సమాచారం తెలుసుకున్న సమంతా, '' నీ విషయంలో చాలా సంతోషంగా వున్నాను .. ఆల్ ది బెస్ట్ మై స్టార్ '' అంటూ లవ్ సింబల్ యాడ్ చేసి మరీ ట్వీట్ చేసింది. అందుకు ఆయన పొంగిపోతూ '' థ్యాంక్యూ సో మచ్ .. ఇది నాకు చాలా చాలా స్పెషల్ ట్వీట్'' అంటూ సంతోషంతో సమాధానం ఇచ్చాడు. దాంతో ఈ కాంబినేషన్ త్వరలోనే రెడీ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)