ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'అ ఆ' విషయంలో సమంతా సంతోషం!

Sat, May 07, 2016
సమంతా
సమంతా
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' సినిమా, విడుదలకి ముస్తాబవుతూ వుంది. నితిన్ జోడీగా ఈ సినిమాలో సమంతా కనిపిస్తుంది. ఈ సినిమాలో తాను పోషించిన పాత్ర పట్ల సమంతా చాలా సంతోషంగా వుందని అంటున్నారు. కథానాయికగా సమంతా చాలా విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అందంగా .. అల్లరిగా కనిపిస్తూ యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇక నటన విషయంలో ఆమెకి పేరు తెచ్చిపెట్టిన చిత్రాలుగా 'ఏ మాయ చేసావే' .. 'మనం' కనిపిస్తాయి. ఈ రెండు సినిమాల తరువాత తనకి ఆ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టే చిత్రంగా 'అ ఆ' ఉంటుందని సన్నిహితులతో చెప్పుకుని సమంతా సంబరపడిపోతోందట. దర్శకుడు త్రివిక్రమ్ ఈ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడనీ, నవరసాలను పలికించే అవకాశం వున్న ఈ పాత్ర తనకి లభించడం అదృష్టమని అంటోందట. తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిన ఈ పాత్రకి , ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం వుందని చెబుతోందట.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)