ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో హాలీవుడ్ మూవీలో మంచు లక్ష్మీ!

Sat, May 07, 2016
మంచు లక్ష్మీ
మంచు లక్ష్మీ
మొదటి నుంచి కూడా మంచు లక్ష్మీ ఇటు బుల్లితెరపైన .. అటు వెండితెరపైన తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. ఇక హాలీవుడ్లోను ఆమె కొన్ని సీరియల్స్ లోను .. సినిమాల్లోను నటించింది. అలాంటి మంచు లక్ష్మీ తాజాగా మరో హాలీవుడ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .. ఆ సినిమా పేరే 'బాస్మతీ బ్లూస్'. బ్రీ లార్సన్ .. డోనాల్డ్ సతర్లాండ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, మంచు లక్ష్మీ ఒక కీలకమైన పాత్రను చేసింది.

ఇది ఒక సైంటిస్ట్ కథ అని తెలుస్తోంది. తాను కనుగొన్న 'వరి' వంగడాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇండియాకి వచ్చిన ఒక సైంటిస్ట్, ఇక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది అనేదే ఈ సినిమా కథాంశం. ఇటీవలే అమెరికా వెళ్లిన మంచు లక్ష్మీ తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ ను పూర్తిచేసి వచ్చింది. డాన్ బారోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)