ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sat, May 07, 2016
ఎమీ జాక్సన్
ఎమీ జాక్సన్
* ఫ్రాన్స్ లో జరగనున్న ప్రతిష్ఠాత్మక కేన్స్ చలన చిత్రోత్సవంలో అందాల ముద్దుగుమ్మ ఎమీ జాక్సన్ మెరవనుంది. ఇందుకు సంబంధించి అమ్మడికి ఆహ్వానం అందింది. అలాగే, అక్కడ బ్రిటిష్ ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసే ప్రత్యేక డిన్నర్ కార్యక్రమానికి కూడా హాజరవుతుంది.
* నెగటివ్ పాత్రలలో నటించడానికి కూడా తాను సిద్ధమేనని చెబుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. మంచి స్క్రిప్టుతో దర్శకుడు తనను కన్విన్స్ చేయగలిగితే కనుక తప్పకుండా నెగటివ్ క్యారెక్టర్లు చేస్తానని సందీప్ చెప్పాడు. ప్రస్తుతం 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమాలో సందీప్ హీరోగా నటిస్తున్న సంగతి విదితమే.
* విశాల్ హీరోగా నటించిన 'రాయుడు' తమిళ అనువాద చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 11న హైదరాబాదులో నిర్వహిస్తారు. శ్రీదివ్య కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)