ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తిస్తోన్న శింబు!

Thu, May 05, 2016
శింబు
శింబు
కోలీవుడ్ తెరపై కాస్త దూకుడుగా కనిపించే కథానాయకుల్లో శింబు ముందువరుసలో కనిపిస్తాడు. తన సినిమాలకి సంబంధించి కొత్తగా కనిపించడానికీ .. ప్రయోగాలు చేయడానికి శింబు ఉత్సాహాన్ని చూపిస్తుంటాడు. సాధ్యమైనంత వరకూ టైటిల్లోనే కొత్తదనాన్ని చూపించడానికి ఆయన ప్రయత్నిస్తుంటాడు.

అలా ఆయన 'ఏ ఏ ఏ' అనే టైటిల్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఈ టైటిల్ వెనుక హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్ చేసే నిర్వచనం ఒకటి వుందట. ఇప్పటికే అదేంటో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపుతున్నారట. శింబు మాత్రం ఈ విషయాన్ని రివిల్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టేశాడని అంటున్నారు. మైఖేల్ రాయప్పన్ నిర్మించనున్న ఈ సినిమాకి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నాడు. శింబు మూడు విభిన్నమైన పాత్రలను పోషించనుండగా, ఆయన సరసన ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే తెలిసే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)