ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ తెరపైకి విజయశాంతి?

Thu, May 05, 2016
విజయశాంతి
విజయశాంతి
తెలుగు తెర అందాల కథానాయికగా విజయశాంతికి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అగ్రకథానాయకులందరి సరసన ఆమె అనేక పాత్రలను పోషించి మెప్పించింది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలను సైతం చేసి, గ్లామర్ పరంగా .. నటన పరంగా అలరించింది. అలాంటి విజయశాంతి రాజకీయాల్లోకి ప్రవేశించడం వలన, వెండితెరకి దూరమైంది.

కొంతకాలంగా రాజకీయాలకి కూడా దూరంగా వున్న విజయశాంతి, తిరిగి నటన వైపు దృష్టి పెట్టిందనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. ప్రస్తుతం ఆమె తన సినిమాకి సంబంధించిన పనుల్లోనే ఉందనీ, వచ్చే ఏడాది జూన్ నాటికి ఆ సినిమాను తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో వుందని అంటున్నారు. అయితే ఈసారి ఆమె దేశభక్తికి సంబంధించిన కథాంశాన్ని ఎంచుకుందని కొంతమంది అంటుంటే, 'ఒసేయ్ రాములమ్మ'కి సీక్వెల్ చేయనుందని మరికొంతమంది అంటున్నారు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన స్పష్టత రావచ్చు.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)