ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాజ్ తరుణ్ ను తప్పించారా?

Wed, May 04, 2016
రాజ్ తరుణ్
రాజ్ తరుణ్
తెలుగు తెరపై యువకథానాయకుడిగా రాజ్ తరుణ్ దూకుడు చూపిస్తూ వస్తున్నాడు. 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' కాస్త నిరాశ పరచినా, 'ఈడోరకం ఆడోరకం' సక్సెస్ తో మళ్లీ గాడిలో పడిపోయాడు. రాజ్ తరుణ్ కి కథ .. స్క్రీన్ ప్లే పై మంచి పట్టుంది. ఇప్పుడు ఇదే ఆయనకి ఇబ్బంది తెచ్చిపెట్టిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఇతర విషయాల్లో ఆయన జోక్యం ఎక్కువ కావడం వల్లనే, దిల్ రాజు 'శతమానం భవతి' నుంచి ఆయనని తప్పించాడని అంటున్నారు. ఈ సినిమాను ఆయన శర్వానంద్ తో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇక రాజ్ తరుణ్ కథానాయకుడిగా సీనియర్ వంశీతో సినిమా నిర్మించాలనుకున్న మధుర శ్రీధర్ కూడా, మరో హీరో కోసం వెతుకుతున్నాడని అంటున్నారు. స్క్రిప్టు ను మార్చమనీ .. దర్శకుడిని మార్చమని రాజ్ తరుణ్ వత్తిడి చేస్తుండటం వల్లనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)