ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'24' ప్రీమియర్ షోకి సూర్య దంపతులు

Tue, May 03, 2016
సూర్య
సూర్య
సూర్య కథానాయకుడిగా నటించిన '24' సినిమా, ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అమెరికాలోను తెలుగు .. తమిళ వెర్షన్లలో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సూర్య అక్కడే వున్నాడు. ఈ నెల 5న ఈ సినిమా ప్రీమియర్ షోలను కాలిఫోర్నియాలో ప్రదర్శించనున్నారు. తెలుగు .. తమిళ ప్రీమియర్ షోలకి సూర్య .. జ్యోతికతో కలిసి హాజరుకానున్నాడు.

విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా .. టైమ్ మిషన్ కాన్సెప్ట్ తో రూపొందింది. వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కడం వలన, ఈ సినిమా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో సూర్య మూడు పాత్రలను పోషించడం, సమంతా - నిత్యామీనన్ కథానాయికలుగా నటించడం కూడా అంచనాలు పెంచుతున్నాయి. సూర్య ఎదురుచూస్తోన్న విజయం ఈ సినిమాతో దక్కుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)