ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'పుల్లెల గోపీచంద్'గా సుధీర్ బాబు!

Tue, May 03, 2016
సుధీర్ బాబు
సుధీర్ బాబు
ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో సుధీర్ బాబు నటించనున్నట్టు కొంతకాలం క్రితమే వార్తలు షికారు చేశాయి. అయితే ఎందుకనో ఈ విషయంలో ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి సుధీర్ బాబు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడని అంటున్నారు. సుధీర్ బాబు మంచి బాడ్మింటన్ ప్లేయర్ .. అంతేకాదు ఆయన పుల్లెల గోపీచంద్ కి స్నేహితుడు కూడా.

అందువలన ఆయన బయోపిక్ లో నటించడానికి చాలాకాలంగా ఉత్సాహాన్ని చూపుతూ వచ్చాడు. అందుకు సంబంధించిన పనులు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయని అంటున్నారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థతో సుధీర్ బాబు ఈ సినిమా నిర్మాణాన్ని గురించి చర్చలు జరుపుతున్నాడనీ, ప్రవీణ్ సత్తారు దర్శకుడిగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు. తెలుగుతో పాటు హిందీలోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)