ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సాయిధరమ్ తేజ్ కి విలన్ గా తారకరత్న?

Mon, May 02, 2016
తారకరత్న
తారకరత్న
సాయిధరమ్ తేజ్ తో దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో విలన్ గా తారకరత్న నటించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. 'అమరావతి' సినిమా నుంచి తారకరత్న నెగిటివ్ రోల్స్ చేయడంలో తన సత్తా చాటుతూనే వస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన 'రాజా చెయ్యి వేస్తే' సినిమాలోను ఆయన విలన్ పాత్రను పోషించాడు.

ప్రతినాయకుడిగా ఆయన నటన నచ్చడంతో, తమ సినిమాలో తారకరత్నను తీసుకుందామని గోపీచంద్ మలినేనితో సాయిధరమ్ తేజ్ అన్నాడట. దాంతో ఆయన తారకరత్నను సంప్రదించాడనీ, ఈ సినిమాలో తన పాత్రను గురించి తెలుసుకుని ఆయన పాజిటివ్ గా స్పందించాడని అంటున్నారు. ఈ సినిమాతో ఇక యంగ్ విలన్ గా తారకరత్న కెరియర్ స్పీడు అందుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)