ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కమల్ మూవీకి అసిస్టెంట్ గా కూతురు!

Mon, May 02, 2016
అక్షర హాసన్
అక్షర హాసన్
కమలహాసన్ కథానాయకుడిగా 'శభాష్ నాయుడు' సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. టి.కె.రాజీవ్ కుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, ఈ నెల 16న లాస్ ఎంజిల్స్ లో ప్రారంభం కానుంది. 80 శాతం చిత్రీకరణను అక్కడే జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

గతంలో 'దశావతారం' సినిమాలో కనిపించిన ఒక గెటప్ లో ఈ సినిమాలో కమల్ కనిపించనున్నాడు. ఇక కథాపరంగా కమల్ కూతురుగా శ్రుతిహాసన్ నటించనుండటం ఓ విశేషం. ఇక ఈ సినిమాకి కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండటం మరో విశేషం. అక్షర హాసన్ కి గతంలో కొన్ని బాలీవుడ్ సినిమాలకి సహాయ దర్శకురాలిగా పనిచేసిన అనుభవం వుంది. దాంతో ఆమె కమల్ సొంత బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది. మొత్తానికి కమల్ ఈ త్రిభాషా చిత్రం కోసం ఇద్దరు కూతుళ్లతో కలిసి పనిచేస్తూ ముచ్చట తీర్చుకుంటున్నాడన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)