ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ కు జోడీగా బాలీవుడ్ భామ!

Mon, May 02, 2016
దీపికా పదుకొనె
దీపికా పదుకొనె
తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన బాలీవుడ్ భామ, పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనె జత కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' చిత్రంలో నటిస్తున్న మహేశ్, దీని తర్వాత ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో భారీ బడ్జెట్టుతో దీనిని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
కాగా, ఈ చిత్రంలో మహేశ్ సరసన నటించే కథానాయిక పాత్ర కోసం చాలామంది భామలను పరిశీలించారు. ఈ క్రమంలో పలు పేర్లు ప్రచారంలోకి కూడా వచ్చాయి. అయితే, తాజాగా దీపికా పదుకొనెతో చిత్రం యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఇది కార్యరూపం దాలిస్తే కనుక, ఇప్పటికే తమిళంలో రజనీకాంత్ సరసన నటించిన దీపిక, తెలుగులో నటించే తొలిచిత్రం ఇదే అవుతుంది.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)