ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమిళ రీమేక్ లో పవన్ కల్యాణ్?

Sun, May 01, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
'సర్దార్ గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కల్యాణ్ చేస్తున్నది తమిళ రీమేకా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. కాగా, అజిత్ హీరోగా తమిళంలో వచ్చిన 'వీరమ్' చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని అంటున్నారు. ఆ చిత్రం రీమేక్ హక్కులను పవన్ ఎప్పుడో తీసుకున్నారని, దానిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నారని చెబుతున్నారు. పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఒరిజినల్ లో లేని కొత్త సన్నివేశాలను కూడా జొప్పిస్తున్నారట. యాక్షన్ లవ్ స్టోరీగా ఇది తెరకెక్కుతుంది.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)