ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సినిమా కోసం బాగా తింటున్న హీరో!

Sun, May 01, 2016
ఆర్య
ఆర్య
స్లిమ్ గా, ఫిట్ గా కనపడడం కోసం మన హీరోలు, హీరోయిన్లు తక్కువ డైట్ తీసుకుంటారు. ఆ క్రమంలో తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను ఎన్నింటినో పక్కన పెట్టేస్తుంటారు కూడా. అయితే, ఇందుకు భిన్నంగా తమిళ నటుడు ఆర్య ఇప్పుడు ఫుడ్డుని ఓ పట్టుపడుతున్నాడు. రోజుకి 40 కోడిగుడ్లు లాగించేస్తున్నాడు. అంతేకాదండోయ్, రెండు కిలోల కోడి మాంసాన్ని కూడా గుటకాయస్వాహా చేసేస్తున్నాడు. ఇదంతా ప్రస్తుతం రాఘవ దర్శకత్వంలో తాను నటిస్తున్న తాజా తమిళ చిత్రం కోసమట!

ఈ చిత్రంలో ఆర్య అడవిమనిషి పాత్రను పోషిస్తున్నాడు. దాంతో మనిషి కండలు తిరిగి ... భారీకాయంతో కనిపించాలి. అందుకోసం దర్శకుడి సూచనల మేర ఇలా తిండిపోతు అవతారం ఎత్తాడు. ఈ తిండితో పాటు వర్కౌట్స్ సరేసరి. రోజుకి రెండు గంటల పాటు కసరత్తులు చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడు, కేరళ అటవీ ప్రాంతాలలో జరుగుతోంది. అందుకోసం జిమ్ సరంజామాను కూడా తన వెంట ప్రత్యేకమైన వ్యానులో తీసుకువెళ్లాడు. అలాగే, సాయంకాలం వేళల్లో గంట పాటు అక్కడి కొండలు ఎక్కి దిగడం చేస్తున్నట్టు కూడా ఆర్య తెలిపాడు. మొత్తానికి ఈ అడవిమనిషి పాత్ర కోసం ఈ హీరోగారు చాలానే కష్టపడుతున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)