ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రేమకథా చిత్రంగా వస్తోన్న 'పెన్సిల్'

Sat, Apr 30, 2016
'పెన్సిల్' లోప్రకాశ్ కుమార్, శ్రీదివ్య
'పెన్సిల్' లోప్రకాశ్ కుమార్, శ్రీదివ్య
కోలీవుడ్ యువ కథానాయకులలో జీవీ ప్రకాశ్ కుమార్ మాంచి దూకుడు మీద వున్నాడు. లవర్ బాయ్ గా ఇప్పుడు అక్కడ ఆయనకి ఎంతో ఇమేజ్ వుంది. ఇక యువ కథానాయికలలో శ్రీదివ్యకి కూడా అంతే క్రేజ్ వుంది. తెలుగు అమ్మాయే కావడం వలన .. ఇక్కడ కొన్ని సినిమాలు చేయడం వలన శ్రీదివ్యకి ఇక్కడ కూడా అభిమానులు వున్నారు. అలాంటి ఈ ఇద్దరూ నాయకా నాయికలుగా నటించిన చిత్రమే 'పెన్సిల్'.

తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందింది. మణి నాగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, సంగీతాన్ని అందించినది కూడా జీవీ ప్రకాశ్ కుమార్ కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాడు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెస్తాయనీ, అలాగే పాటలు యూత్ ను కొత్త లోకంలో విహరింపజేస్తాయని అన్నాడు. ఈ సినిమాను మే 13న విడుదల చేయనున్నామనీ, అనూహ్యమైన స్థాయిలో ఆదరణ లభిస్తుందనే నమ్మకం వుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)