ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విలన్ గా మెప్పించిన సుధీర్ బాబు

Sat, Apr 30, 2016
సుధీర్ బాబు
సుధీర్ బాబు
తెలుగులో విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ .. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ సుధీర్ బాబు తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ మధ్య కథానాయకుడిగా 'భలేమంచి రోజు'తో బంపర్ హిట్ కొట్టిన ఆయన, ఇప్పుడు విలన్ గా బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించాడు. తెలుగులో కథానాయకుడిగా ఒక్కో మెట్టూ ఎదుగుతోన్న ఆయన, బాలీవుడ్ మూవీ 'భాగీ'లో విలన్ గా నటించాడు.

టైగర్ ష్రాఫ్ .. శ్రద్ధా కపూర్ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమా, నిన్ననే భారీస్థాయిలో విడుదలైంది. తొలి రోజున రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ఎంతో కసరత్తు చేశాడు .. మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆయన చూపిన అంకిత భావం .. పడిన శ్రమ వృథా పోలేదు. విలన్ నటన అదుర్స్ అని బాలీవుడ్ ప్రేక్షకులు కితాబునిస్తున్నారట. విమర్శకులు సైతం ఆయన నటనను ప్రశంసిస్తున్నారని అంటున్నారు. ఇక సుధీర్ బాబు బాలీవుడ్ లోను బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)