ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఒక్క అమ్మాయి తప్ప' ఆడియో రిలీజ్ డేట్

Sat, Apr 30, 2016
నిత్యామీనన్
నిత్యామీనన్
సందీప్ కిషన్ .. నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమా ద్వారా రాజసింహ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన బాణీలు ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకను మే 8న హైదరాబాద్ - శిల్పకళా వేదికలో జరపాలని నిర్ణయించుకున్నారు.

సందీప్ కిషన్ - నిత్యామీనన్ కాంబినేషన్ కావడం వలన ఈ సినిమాపై యూత్ లో ఆసక్తి వుంది. కథాబలం .. పాత్రలో కొత్తదనం ఉంటేనే నిత్యామీనన్ ఏ సినిమానైనా అంగీకరిస్తుంది. అలాగే సందీప్ కిషన్ కూడా వైవిధ్యభరితమైన పాత్రలను మాత్రమే చేసుకుంటూ వస్తున్నాడు. అందువలన ఈ సినిమాలో తాము ఆశించే ఫీల్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇక విడుదల తేదీని కూడా ఈ సినిమా టీమ్ త్వరలో ప్రకటించే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)