ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'శభాష్ నాయుడు' గా కమల్

Fri, Apr 29, 2016
కమల్ - శ్రుతి హాసన్
కమల్ - శ్రుతి హాసన్
కమలహాసన్ తాజా చిత్రానికి 'శభాష్ నాయుడు' పేరును ఖరారు చేస్తూ, ఈ సినిమాకి సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ ను చెన్నై వేదికగా ఈ రోజు ఉదయం విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కమల్ .. 'దశావతారం' సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ 'బలరామ్ నాయుడు' గెటప్ లోనే కనిపిస్తుండటం విశేషం. ఆ గెటప్ లో కమల్ హడావిడిగా బైక్ నడుపుతూ వుంటే, ఆయన వెనక కూర్చుని భయపడిపోతూ బ్రహ్మానందం కనిపిస్తున్నాడు.

ఈ సినిమాలో బ్రహ్మానందం కమల్ కి అసిస్టెంట్ పాత్రలో అలరిస్తాడని తెలుస్తోంది. కమల్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, ఆయన కూతురి పాత్రను శ్రుతి హసన్ పోషిస్తోంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు .. తమిళ భాషల్లో బ్రహ్మానందం పోషించిన పాత్రను, హిందీలో సౌరభ్ శుక్లా పోషిస్తున్నాడు. హిందీలో 'శభాష్ కుందు' అనే పేరుతో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)