ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అల్లు శిరీష్ కొత్త చిత్రం ప్రారంభం!

Thu, Apr 28, 2016
అల్లు శిరీష్
అల్లు శిరీష్
అల్లు శిరీష్ కథానాయకుడిగా కొత్త చిత్రం ఆరంభమైంది. హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ఈ రోజు ఈ సినిమాను లాంచ్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా .. శ్రీను వైట్ల స్విచ్చాన్ చేయగా .. మారుతి గౌరవ దర్శకత్వం వహించాడు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా, ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడాడు. 'శ్రీరస్తు .. శుభమస్తు' తరువాత తాను చేస్తోన్న సినిమా ఇదేనని ఆయన అన్నాడు. దర్శకుడు ఎం.వి.ఎన్.రెడ్డితో తనకి మంచి పరిచయం ఉందనీ .. అంతకన్నా ఎక్కువగా ఆయనపై నమ్మకం వుందని చెప్పాడు. ఇది పూర్తిగా లవ్ ఎంటర్టైనర్ అనీ .. 700 యేళ్ల నాటి చారిత్రక నేపథ్యంతో ముడిపడి ఉంటుందని అన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం లొకేషన్స్ చూడటం జరుగుతోందనీ, జూలై మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)