ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఊపిరి' హిందీ రీమేక్ లో తమన్నా?

Thu, Apr 28, 2016
తమన్నా
తమన్నా
'ఊపిరి' .. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, భారీ విజయాన్ని సాధించింది. నాగార్జున .. కార్తీ .. తమన్నా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఓవర్సీస్ లోను రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. పీవీపీ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాను, హిందీలో రీమేక్ చేయడానికి కరణ్ జోహార్ ఆసక్తిని చూపిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఆయన ఈ సినిమా రీమేక్ కి సంబంధించిన పనుల్లోనే ఉన్నాడని అంటున్నారు. తెలుగులో తమన్నా పోషించిన పాత్రకి గాను, హిందీలోను ఆమెనే తీసుకోవాలని కరణ్ జోహార్ భావిస్తున్నాడట. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా నటించిందనే ఉద్దేశంతో ఆమెను తీసుకోవాలని అనుకుంటున్నాడనే వార్త బాలీవుడ్లో షికారు చేస్తోంది. ఈ ఛాన్స్ తగిలితే తమన్నాకి అక్కడ మరికొన్ని అవకాశాలు దక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)