ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కమల్ మూవీలో బ్రహ్మానందం!

Wed, Apr 27, 2016
బ్రహ్మానందం
బ్రహ్మానందం
కమలహాసన్ కథానాయకుడిగా టి.కె.రాజీవ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాను ఈ నెల 29న లాంచ్ చేయనున్నారు. చెన్నై - నడిగర సంగం ఆఫీసులో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనున్నట్టు కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

కమల్ సొంత బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాలో బ్రహ్మానందం నటించనున్నాడు. ఈ పాత్ర కోసం బ్రహ్మానందాన్ని కమల్ సూచించాడని అంటున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర వైవిధ్యభరితంగా ఉంటుందని చెబుతున్నారు. తమిళ .. తెలుగు .. మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కమల్ కూతురు పాత్రను శ్రుతిహాసన్ పోషించనుండటం విశేషం. తండ్రీకూతుళ్లు కలిసి మొదటిసారిగా నటిస్తుండటం వలన, ఈ సినిమాపై అందరిలను ఆసక్తి వుంది. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)