ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గోవా వెళ్లనున్న 'ప్రేమమ్' టీమ్

Tue, Apr 26, 2016
ఒక వైపున 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాను .. మరో వైపున 'ప్రేమమ్'ను ఒకేసారి పూర్తి చేసే పనిలో నాగచైతన్య వున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నాయకా నాయికల మధ్య ప్రేమ సంబంధమైన సన్నివేశాల చిత్రీకరణతో ఈ షెడ్యూల్ పూర్తవుతుంది.

ఆ తరువాత ఈ సినిమా టీమ్ గోవా షెడ్యూల్ ని ప్లాన్ చేసింది. మే 3వ తేదీ నుంచి 2 వారాల పాటు అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది. కథాపరంగా చైతూతో ప్రేమించబడే పాత్రల్లో శ్రుతిహాసన్ .. అనుపమ పరమేశ్వరన్ .. మడోనా సెబాస్టియన్ కనిపించనున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, జూలైలో విడుదల చేసే ఆలోచనలో వున్నారు. మలయాళంలో పెద్ద హిట్ అయిన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)