ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దర్శకుడిగా మారుతున్న సీనియర్ నటుడు!

Tue, Apr 26, 2016
అరవింద్ స్వామి
అరవింద్ స్వామి
తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడైన సీనియర్ నటుడు అరవింద్ స్వామి మెగా ఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. అవును, దర్శకుడిగా కూడా ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమాయత్తమవుతున్నాడు. ఈ విషయాన్ని తనే వెల్లడించాడు.

"నా దగ్గర ఇప్పటికే రెండు స్క్రిప్టులు సిద్ధంగా వున్నాయి. వీటిలో ఒకటి ఎంచుకుని సెట్స్ కి వెళతాను. అది కూడా ఈ ఏడాదే కావచ్చు. అయితే, ఈ చిత్రాన్ని తమిళంలో చేయాలా? లేక హిందీలోనా? అన్నది ఇంకా డిసైడ్ చేయలేదు" అని చెప్పాడు అరవింద్ స్వామి.

'దళపతి', 'రోజా', 'బొంబాయి' వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ తమిళ కథానాయకుడు ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. తాజాగా తమిళంలో వచ్చిన 'తని ఒరువన్' చిత్రంలో ఆయన పోషించిన విలన్ పాత్రకు ఎన్నో ప్రశంసలు లభించాయి. దాంతో ఈ చిత్రం తెలుగు రీమేక్ లోనూ (చరణ్ హీరోగా రూపొందుతోంది) ఆయన అదే పాత్రను పోషిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)