ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గ్లామర్ డోస్ పెంచడానికి వెనుకాడదట

Mon, Apr 25, 2016
అమలా పాల్
అమలా పాల్
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా అమలా పాల్ మంచి గుర్తింపును తెచ్చుకుంది. వివాహం తరువాత వెండితెరకి దూరమైన ఆమె, మళ్లీ వరుస సినిమాలు చేయడానికి రంగంలోకి దిగింది. ప్రస్తుతం కన్నడలోను ఆమె ఓ సినిమా చేస్తోంది. అయితే ఇది వరకటిలా ఆమెకి గ్లామర్ పాత్రలు కాకుండా, సీరియస్ పాత్రలే ఎక్కువగా దక్కుతున్నాయి.

వివాహం తరువాత ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన కారణంగా, గ్లామర్ పాత్రలకి అడగడానికి దర్శక నిర్మాతలు సంకోచిస్తున్నారట. ఆమె చేయనంటుదేమోనని వేరేవారిని సంప్రదిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన అమలా పాల్ .. గ్లామర్ పాత్రలను పోషించడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేస్తోంది. తాను ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోననీ .. గతంలో మాదిరిగానే గ్లామర్ పాత్రలను కూడా పోషిస్తానని చెబుతోంది. అయితే తనని గ్లామర్ పాత్రలకి అడగడానికి వచ్చే వాళ్లు, పారితోషికాన్ని ఎక్కువగా ఇవ్వడానికి సిద్ధపడి రావాలని సెలవిచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)