ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రభుదేవా సరసన ఎమీ జాక్సన్!

Mon, Apr 25, 2016
ఎమీ జాక్సన్
ఎమీ జాక్సన్
వరుసగా హిందీ సినిమాలను తెరకెక్కిస్తూ బాలీవుడ్లో బిజీబిజీగా వున్న ప్రభుదేవా, తిరిగి నటనపై దృష్టి పెట్టాడనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఒక తమిళ సినిమా చేస్తున్నాడు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో రూపొందుతోంది. తెలుగులో 'అభినేత్రి' అనే పేరును ఖరారు చేశారు. తమన్నా ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ హారర్ చిత్రం ప్రస్తుతం షూటింగు దశలో వుంది.

ఈ సినిమాలో ఒక పాటలో ఎమీ జాక్సన్ కనిపించనుందనే వార్తలు కోలీవుడ్లో షికారు చేస్తున్నాయి. ఇందులోని ఒక స్పెషల్ సాంగ్ లో తనతో కలిసి ఎమీ జాక్సన్ స్టెప్పులు వేస్తే బాగుంటుందని ప్రభుదేవా భావించాడట. ప్రస్తుతం ఆమె 'రోబో 2.0' సినిమాలో బిజీగా వున్నా, ఒక్క పాటే కనుక ఒప్పుకోవచ్చని అనుకుంటున్నారు. దర్శకుడు విజయ్ తో కలిసి ప్రభుదేవా గట్టి ప్రయత్నం చేస్తున్నాడని చెబుతున్నారు. ఇక ఆమె నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)