ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ కి మహేశ్ వాయిస్ ఓవర్!

Mon, Apr 25, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
ఇటీవలి కాలంలో ఒక హీరో మరో హీరో చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడమన్నది కామన్ అయిపోయింది. ఆయా హీరోల స్థాయిని బట్టి ఈ వాయిస్ ఓవర్ కూడా ఆయా చిత్రాలకు ఎంతో కొంత ప్లస్ అవుతూ వుంటుంది. ఈ విషయంలో స్టార్ హీరో మహేశ్ బాబు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముందుంటాడు. గతంలో పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా', ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా', ఇటీవల తన తండ్రి నటించిన 'శ్రీశ్రీ' చిత్రాలకు అలా వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

తాజాగా మరోసారి ఎన్టీఆర్ నటించే చిత్రానికి కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 'జనతా గ్యారేజ్' చిత్రానికి మహేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంగీకరించినట్టు వార్తలొస్తున్నాయి. దర్శకుడు కొరటాల, ఎన్టీఆర్ లతో వున్న అనుబంధం కారణంగా అందుకు ఓకే చెప్పాడని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే కనుక, ఈ సినిమాకి అది కచ్చితంగా అదనపు ఆకర్షణ అవుతుందనే చెప్పచ్చు!
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)