ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శాతకర్ణి కథను సిద్ధం చేసిన ఆచార్యులు ఆయనే!

Sat, Apr 23, 2016
ఆచార్య రంగనాయకులు
ఆచార్య రంగనాయకులు
ఇప్పుడు ఎక్కడ చూసినా బాలకృష్ణ 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించే మాట్లాడుకుంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నట్టుగా బాలకృష్ణ ప్రకటించడం .. ఈ సినిమాను లాంచ్ చేసేయడం చకచకా జరిగిపోయాయి. ఇంత తక్కువ కాలంలో ఈ చారిత్రక కథను ఎలా తయారు చేసుకున్నారనే సందేహం అందరిలోను తలెత్తింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి కావలసిన కథను సిద్ధం చేసినది ఆచార్య రంగనాయకులు గారని తెలుస్తోంది.

శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేసిన రంగనాయకులు గారికి, చరిత్రపై ఎంతో అవగాహన వుంది. చరిత్ర .. ఆయుర్వేదం .. భాషా శాస్త్రం .. యాత్రా సాహిత్యం .. పర్యావరణంపై ఆయన ఎన్నో పుస్తకాలను రాశారు. పురావస్తు శాస్త్రంలోను ఆయనకి గల అనుభవాన్ని బట్టి, తితిదే వారు ఆయనని తిరుమలలోని మ్యూజియానికి ముఖ్య అధికారిగా నియమించారు.

'గౌతమీపుత్ర శాతకర్ణి' జీవితచరిత్రతో సినిమా చేయాలని భావించిన బాలకృష్ణ, ఆరు నెలల క్రితమే ఆచార్య రంగనాయకులుగారిని కలుసుకున్నారట. బాలకృష్ణ మనసులోని మాటను తెలుసుకున్న ఆయన, పలు చారిత్రక అంశాలను పరిశీలించి శాతకర్ణికి సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని సేకరించారు. ఆ కథను సినీ నేపథ్యానికి అనుగుణంగా సిద్ధం చేసి, దర్శకుడు క్రిష్ కి అందజేశారు. నిన్న జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి, ఆయనని బాలకృష్ణ ఆహ్వానించి ప్రముఖుల సమక్షంలో సత్కరించారు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)