ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తాప్సీ రూటే వేరు!

Sat, Apr 23, 2016
తాప్సీ
తాప్సీ
తెలుగు తెరపై అందాల కథానాయికగా మెరిసిన తాప్సీ, ప్రస్తుతం బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. సాధారణంగా కథానాయికలు బరువు పెరగకుండా వుండటం కోసం, ఆహారాన్ని మితంగా మాత్రమే తీసుకుంటూ వుంటారు. ఫిట్ నెస్ కోసం ఉదయాన్నే జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేస్తుంటారు. తాను మాత్రం అందుకు కాస్త భిన్నమేనని తాప్సీ చెబుతోంది.

ఆహారం విషయంలో తనకి ఎలాంటి నియమం లేదని అంటోంది. నచ్చింది కనిపిస్తే చాలు .. ఆలస్యం చేయకుండా లాగించేస్తూ ఉంటానని చెబుతోంది. ఉదయం నిద్రలేచిన తరువాత ఉడకబెట్టిన కాయగూరలు తింటాననీ, గ్రీన్ టీ తీసుకుంటానని అంటోంది. ఇక తనకి జిమ్ కి వెళ్లే అలవాటు పెద్దగా లేదనీ, స్విమ్మింగ్ చేయడానికి .. డాన్స్ చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని చెబుతోంది. ఈ విధంగా చేయడం వలన వ్యాయామం చేసినట్టు అవుతుందని అంటోంది. ఇక ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా హాయిగా నిద్రపోతాననీ, అదే తన గ్లామర్ సీక్రెట్ అని చెబుతోంది.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)