ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

100వ మైలురాయిని చేరుకున్న 'సోగ్గాడు'

Sat, Apr 23, 2016
నాగార్జున
నాగార్జున
'సోగ్గాడే చిన్నినాయన' సినిమా నాగార్జున కెరియర్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. కథానాయకుడిగా నాగార్జునకు సంతోషాన్ని కలిగించడమే కాకుండా, ఒక నిర్మాతగా కూడా ఆయనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది.

అలాంటి ఈ సినిమా అదే ఉత్సాహంతో పరుగులుతీస్తూ, 100 రోజుల మైలురాయిని చేరుకుంది. విజయవాడ .. గుంటూరు .. మచిలీపట్నం .. ఆదోనిలలో ఈ సినిమా ఈ రోజుతో 100 రోజులను పూర్తిచేసుకోనుంది. నాగార్జున ద్విపాత్రాభినయం చేయడం .. కథా వస్తువు గ్రామీణ నేపథ్యానికి సంబంధించినది కావడం ఈ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి. ఇక రమ్యకృష్ణ .. లావణ్య త్రిపాఠి కథానాయికలుగా మెప్పించడం, అనసూయ .. హంసానందిని .. అతిథి పాత్రలో అనుష్క ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఈ సినిమా విజయానికి కారణమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)