ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుదీప్ జోడీగా ఛాన్స్ కొట్టేసింది!

Fri, Apr 22, 2016
అమలా పాల్
అమలా పాల్
ఆకర్షణీయమైన రూపంతో .. ఆకట్టుకునే నటనతో అభిమానులను సంపాదించుకున్న కథానాయికగా అమలా పాల్ కనిపిస్తుంది. మలయాళ చిత్రపరిశ్రమలో కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్, తమిళ .. తెలుగు భాషల్లో అగ్రకథానాయకులతో కలిసి నటించింది. అలాంటి అమలాపాల్ వివాహం తరువాత కాస్త గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో దూసుకుపోయినవాళ్లు చాలా తక్కువ. కానీ అందుకు భిన్నంగా అమలా పాల్ వరుస అవకాశాలను సంపాదించుకుంటోంది.

ప్రస్తుతం తమిళంలో ధనుష్ సినిమాలో నటిస్తోన్న ఆమెకి, కన్నడ నుంచి ఒక అవకాశం వచ్చింది. కన్నడలో సుదీప్ హీరోగా 'హబ్బులి' అనే సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కథానాయికగా అమలా పాల్ ను ఎంపిక చేశారు. కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్, ఈ సినిమాతో కన్నడ ప్రేక్షకులకి పరిచయమవుతూ వుండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)