ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కృష్ణవంశీ దర్శకత్వంలో మరోసారి కాజల్!

Wed, Apr 20, 2016
కాజల్
కాజల్
కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా సందీప్ కిషన్ నటించనున్నాడనే వార్త రీసెంట్ గా బయటికి వచ్చింది. సందీప్ సరసన కాజల్ .. లావణ్య త్రిపాఠి కథానాయికలుగా అలరించనున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాలో సందీప్ కిషన్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనీ, అతని చుట్టూనే కథ తిరుగుతుందని చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ .. సుదీప్ ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి కృష్ణవంశీ సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో కాజల్ 'చందమామ' .. 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలు చేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే వుండే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)