ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మణిరత్నానికి కథానాయిక దొరికేసింది

Wed, Apr 20, 2016
అదితి రావు
అదితి రావు
మణిరత్నం ఓ తమిళ సినిమాను తెరకెక్కించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. కార్తీ కథానాయకుడిగా రూపొందనున్న ఈ సినిమాకి కథానాయికగా ఆయన సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నారు. అయితే పాత్రకి తగిన వయసు సాయిపల్లవికి లేదని భావించిన మణిరత్నం, మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. ఇక ఈ పాత్రకి గాను ఆయన 'అదితి రావు'ను తీసుకున్నాడనేది తాజా సమాచారం.

హైదరాబాద్ కి చెందిన అదితి రావు పలు హిందీ సినిమాల్లో నటించింది. అదితి రావు అయితే తన సినిమాలోని పాత్రకి సరిగ్గా సరిపోతుందని భావించిన మణిరత్నం, ఆమెను ఫైనల్ చేశాడని అంటున్నారు. మణిరత్నం సొంత బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సెప్టెంబర్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'ఓకే బంగారం' వంటి సూపర్ హిట్ తరువాత మణిరత్నం చేస్తోన్న సినిమా కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి పెరుగుతోంది.
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)