ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తండ్రికి సాయపడనున్న రాజమౌళి!

Tue, Apr 19, 2016
రాజమౌళి
రాజమౌళి
కథల విషయంలో రాజమౌళికి ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ సాయపడుతుంటాడు. ఇక తండ్రి దర్శకత్వం వహించే సినిమాలకి, రాజమౌళి కూడా తన వంతు సహాయాన్ని అందిస్తుంటాడు. రాజమౌళి సినిమాలు ఘనవిజయాలను సాధించడం వెనుక, కథా రచయితగా ఆయన తండ్రి కృషి కనిపిస్తుంది. అలాగే విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించిన 'రాజన్న' సినిమాకి, ఓ క్రియేటివ్ డైరెక్టర్ గా రాజమౌళి సాయపడ్డాడు.

అదే విధంగా తండ్రి డైరెక్ట్ చేయనున్న ఓ హిందీ సినిమాకి, రాజమౌళి తన సహాయాన్ని అందించనున్నాడని చెబుతున్నారు. బాలీవుడ్ కి 'బజరంగీ భాయిజాన్' కథను అందించి, ఆ సినిమా విజయంలో విజయేంద్రప్రసాద్ కీలకమైన పాత్రను పోషించారు. త్వరలో ఆయన సన్నిడియోల్ హీరోగా 'మేరా భారత్ మహాన్' సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో, క్రియేటివ్ డైరెక్టర్ గా రాజమౌళి తన తండ్రికి సాయంగా నిలబడతాడని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)