ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మెహరీన్ ఆ సినిమా చేయడం లేదట!

Mon, Apr 18, 2016
మెహరీన్
మెహరీన్
'కృష్ణగాడి వీరప్రేమ గాథ' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన మెహరీన్, సక్సెస్ తో పాటు యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. దాంతో ఈ సుందరిని సంప్రదించే దర్శక నిర్మాతల సంఖ్య సహజంగానే పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ కథానాయకుడిగా తెరకెక్కనున్న 'శతమానం భవతి' సినిమాలో, కథానాయికగా మెహరీన్ ఎంపిక జరిగిందనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ వార్తపై మెహరీన్ స్పందించింది. తాను ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా వస్తోన్న వార్తలను ఆమె ఖండించింది. అసలు ఈ సినిమా విషయంపై తనని ఎవరూ సంప్రదించలేదనీ, ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పింది. ప్రస్తుతం తెలుగులో బీవీఎస్ రవి దర్శకత్వంలో ఒక సినిమా ను అంగీకరించానని అంది. ఇక హిందీలో అనుష్క శర్మ నిర్మిస్తోన్న ఒక సినిమాను ఒప్పుకున్నానని చెప్పింది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో వున్నాయని స్పష్టం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)