ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరోసారి ఎన్టీఆర్ తో జగపతిబాబు?

Mon, Apr 18, 2016
జగపతిబాబు
జగపతిబాబు
ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలో, జగపతిబాబు ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఈ ఇద్దరి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఆడియన్స్ ను ఎంతగానో అలరించాయి. అలాంటి ఈ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకులకు కనువిందు చేయనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం జగపతిబాబును ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఆ పాత్రకి జగపతిబాబు అయితేనే సరిగ్గా సరిపోతాడని భావించి, ఆయనని సంప్రదించనున్నారని సమాచారం. అంతా అనుకున్నట్టుగా జరిగితే, మరోమారు ఈ కాంబినేషన్ తెరపైకి వస్తుందన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)